తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ సోమవారం గుంటూరులోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర కమిషనర్ విజయ సునీత, ఐఎఎస్‌ను కలిశారు. సూళ్లూరుపేట మార్కెటింగ్ యార్డు అభివృద్ధికి రోడ్లు వేయడం, సరిపడ సిబ్బంది నియామకం చేయడం, యార్డు అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఏ ఏం సి చైర్మన్ తో పాటు దొరవారిసత్రం మండల టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, ఓజిలి మండల అధ్యక్షుడు విజయ నాయుడు, టిడిపి నాయకుడు రాజేంద్ర తదితరులు ఉన్నారు.