కర్నూలు: కర్నూలు శివారులోని నాగలాపురం గ్రామ సమీపంలో రోడ్డుప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్
కర్నూలు శివారులోని నాగలాపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 7.30 గంటలకు చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల ఉన్నత పాఠశాల చెందిన 10 మంది ఉపాధ్యాయుల తోపాటు వాహనం డ్రైవర్ ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో అప్రమత్తమైన డ్రైవర్ పక్కనే ఉన్న పొలాల్లోకి దించేశాడు. దీంతో అదుపుతప్పి వాహనం కింద పడడంతో ప్రయాణిస్తున్న టీచర్లకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇందులో డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నాగులాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.