కార్వేటినగరం మండలం ఆర్.కె.వి.బి పేటకు చెందిన రిపోర్టర్ సాంబశివ ఆచారి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన మృతదేహానికి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ఆయన చేసిన సేవలు మరువలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని వివరించారు.