గుంతచీపాడులో తప్పిన పెన్ను ప్రమాదం
చాపాడు మండలం గుంతచీపాడులో మంగళవారం సాయంత్రం వరి ధాన్యంతో వెళ్తున్న లారీపై విద్యుత్ స్తంభం కూలిపడింది. గ్రామంలో రైతుల నుంచి వరిధాన్యం కొనుగోలు చేసిన దలారి లోడును లారీలో తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు తీగలు తగులుకొని విద్యుత్ స్తంభం కూలిపడింది. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, కూలిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.