స్వస్థ నారి సశక్త్ పరివార్' కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించిన పల్నాడు జాయింట్ కలెక్టర్ సూరజ్
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న 'స్వస్థ నారి సశక్త్ పరివార్' కార్య క్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ సూచించారు.సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారి రవితో కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కింద అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యాధికారి తెలిపారు.