కనిగిరి మండలంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యుటిఎఫ్ నాయకులు శుక్రవారం కనిగిరిలో మండల విద్యాశాఖ అధికారులు డివి సుబ్బారావు యు నారాయణరెడ్డి లను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల నమోదు కార్యక్రమాన్ని ఇతరులతో కాకుండా కార్యాలయ సిబ్బందితోనే చేయించాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టినప్పుడు ఇతర ఉపాధ్యాయులను విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉపాధ్యాయుల సమస్యలపై సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.