అసిఫాబాద్: శివ మల్లన్న ఆలయంలో జ్వాల తోరణం
కాగజ్ నగర్ మండలం ఈస్గాంలోని శివ మల్లన్న ఆలయంలో బుధవారం సాయంత్రం జ్వాలా తోరణం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించారు. ఆలయంలోని అర్చకులు జ్వాలాతోరణం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామస్థులు పెద్దఎత్తున తరలివచ్చారు.