రాయచోటి పారిశ్రామిక వృద్ధికి కొత్త దిశ:రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం శిబ్యాల గ్రామంలో సుమారు 50 ఎకరాల్లో రూ.7 కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.ప్రకాశం జిల్లా కనిగిరి నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్చువల్గా శంకుస్థాపన నిర్వహించారు.