జహీరాబాద్: అర్జున్ నాయక్ తండాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి, 6 మంది పై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్ నాయక్ తండాలో పేకాట శిబిరంపై దాడి నిర్వహించి ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు. గ్రామ శివారులో శనివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి 6 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 8100 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.