ధర్మవరం పట్టణానికి చెందిన సీఐటీయూ సీనియర్ నాయకుడు మృతి
ధర్మవరం పట్టణానికి చెందిన సీఐటీయూ సీనియర్ నాయకుడు సయ్యద్ హైదర్ వలీ తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆ రోజుల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హైదర్ వలీని కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం విషమించి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.సీఐటీయూ నాయకుడు మృతి పట్ల ధర్మవరం డివిజన్ కార్యదర్శి జేవి రమణ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.