కలికిరిలో రేషన్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ హారిక
కలికిరిలో రేషన్ దుకాణాలను సబ్ కలెక్టర్ మదనపల్లి సబ్ కలెక్టర్ హారిక మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసి రేషన్ పంపిణీ లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ఎమ్మెల్సీ పాయింట్ ను సబ్ కలెక్టర్ హారిక సందర్శించి గోడౌన్ లోని స్టాకును తనిఖీ చేశారు. రేషన్ డీలర్లకు సక్రమంగా తూకాలు వేసి ఇవ్వాలని, సరైన సమయంలో డీలర్లకు రేషన్ తరలించాలని గోడౌన్ డీటీ విజయ్ కుమార్ రెడ్డి కి సూచించారు. అనంతరం కలికిరి పట్టణంలోని 6, 11, 8 ఎఫ్ఏ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ తనిఖీ నిర్వహించారు.రాగులు,బియ్యం, చక్కెర సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు