నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులుల గణన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా శ్రీశైలం పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని ఆత్మకూరు డీడీ విజ్ఞేష్ అప్పవ్ తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 15 వరకు పాదయాత్రకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయమై భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.అనుమతి లేని కారణంగా పాదయాత్రకు వచ్చిన కన్నడ భక్తులకు అధికారులు అవగాహన కల్పించి, రోడ్డు మార్గంలో శ్రీశైలంకు పంపించారు. భక్తులతో వారి మాతృభాష అయిన కన్నడలోనే మాట్లాడి వివరాలు తెలియజేయడం విశేషం,