విశాఖపట్నం: విశాఖ చేరిన కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు గాజువాక బిజెపి నేతలు కరణం రెడ్డి నరసింగరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్న నిర్మల సీతారామన్ రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం నగరంలో జరిగే జీఎస్టీ సమావేశం, స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్, జీసీసీ బిజినెస్ సెమిట్ వంటి కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు.