జహీరాబాద్: సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై ఆర్వోలు ఏఆర్వోలతో సమావేశం
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలో రెండవ విడత జరగనున్న సర్పంచ్ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో మహేష్ అన్నారు. మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఆర్ వోలు ఏఆర్వోలతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎన్నికలకు సంబంధించిన సూచనలు సలహాలు అందజేశారు.