శంకరంపేట్ ఆర్: జంగారాయి తాండకు చెందిన కెతావత్ అమ్ర అదృశ్యం, కేసు నమోదు
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి తండా చెందిన కేతావతాంద్ర ఈనెల మూడో తేదీ ఉదయం నుండి కనబడడం లేదని చిన్న శంకరంపేట నారాయణ సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల రెండో తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి పడుకున్న కెతావత్ అమ్ర మూడో తేదీ ఉదయం చూసేసరికి ఇంట్లో లేదని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరికైనా కనబడితే డయల్ 100 లేదా చిన్న శంకరంపేట ఎస్సై కి సమాచారం అందించాలన్నారు