ఒంగోలు అర్బన్: మద్యం మత్తులో కత్తెరతో గొంతులో పొడిచి ఒంగోలులో దారుణ హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని సత్యనారాయణపురం మలుపు వద్ద ఉన్న సాగర్ సెంటర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫుల్లుగా మద్యం సేవించిన నాగినేని రామారావు అనే వ్యక్తి సెలూన్ షాప్ లోనికి వెళ్తుండగా షాప్ లో పనిచేసే మహేంద్ర అడ్డుకున్నాడు దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో రామారావు అక్కడే ఉన్న కత్తెర తీసుకొని మహేంద్ర గొంతులో పొడిచాడు తీవ్ర రక్తస్రావమైన మహేంద్రను గమనించిన స్థానికులు 108 వాహనంలో రిమ్స్కు తరలించారు రామారావుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.