ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో ఉరివేసుకొని కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పాపా కాలనీలో షేక్ రహీం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో మనస్పర్దాల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.