ఆర్డిటి క్రీడా మైదానంలో రెవిన్యూ క్రీడా ఏర్పాట్లను రెవిన్యూ సంఘం నేతలతో కలిసి పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి వద్ద ఆర్డిటి క్రీడా మైదానంలో మంగళవారం మూడున్నర గంటల సమయంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ రెవెన్యూ క్రీడా పోటీల ఏర్పాట్లను రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు నవంబర్ 7 8 9 మూడు రోజులు పాటు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని, అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సంఘం నాయకులంతా పాల్గొన్నారు.