పలమనేరు: వర్షాభావ ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్, ప్రజలకు కీలక సూచనలు చేశారు
పలమనేరు: పురపాలక సంఘ కార్యాలయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దృష్ట్యా మునిసిపల్ కమీషనర్ రమణా రెడ్డి వర్షాభావ ప్రభావిత ప్రాంతాలు అయినటువంటి లోతట్టు, ముంపు ప్రాంతాలను తనిఖీ చేయడము జరిగినది. మరియు స్థానిక పెద్ద చెదువును తనిఖీ చేయడము జరిగినది. సంబందిత ప్రాంత ప్రజలను ఉద్దేశించి ప్రజలందరూ ఆశ్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరియు శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలను వెంటనే వెళ్లాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెం. 7337388215 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.