సూర్యాపేట: మహిళ అదృశ్యం కేసు నమోదు నాగారం ఎస్సై ఐలయ్య
నాగారం మండలం తిరుమలగిరికి చెందిన బోడ పున్నమ్మ (46) అనే మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై ఐలయ్య బుధవారం తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. పున్నమ్మ మామిడిపల్లిలో తన కూతురు దగ్గరకు వచ్చింది.. ఈరోజు సూర్యాపేట వెళ్ళి వస్తా అని ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు వెతికారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆమె కూతురు ఫిర్యాదు చేసిందని, ఆచూకీ తెలిస్తే 8712686039 ను సంప్రదించాలని ఎస్సై తెలిపారు.