కనిగిరి: చిన్న దాసళ్ళ పల్లి లో ఉదృతంగా ప్రవహిస్తున్న పిల్లి గుండ్ల వాగు లో కొట్టుకుపోతున్న బైక్ ను వెలికి తీసిన స్థానికులు
హనుమంతునిపాడు మండలంలో బుధవారం భారీ కురిసింది. భారీ వర్షానికి మండలంలోని చిన్న దాసళ్ళ పల్లి గ్రామంలోని పిల్లిగుండ్ల వాగు ఉదృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఓ వ్యక్తి బైక్ తో వాగును దాటేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కింద పడిపోయాడు. అయితే వాగు ఉధృతి నుంచి ఆ వ్యక్తి ప్రాణాలను దక్కించుకోగా అతని బైక్ మాత్రం వాగులో కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో వాగులో కొట్టుకుపోతున్న బైక్ ను వెలికి తీశారు.