కూకట్పల్లి జేఎన్టీయూ హైదరాబాద్లో ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ పురుషులు, మహిళల జట్ల ఎంపిక రమ్య గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమం స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎన్.ఎస్. దిలీప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురుషుల జట్టు చెన్నైలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో, మహిళల జట్టు అన్నా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొంటాయి. సెలక్షన్లో ఇండియన్ కెప్టెన్ రమణ పాల్గొన్నారు.