భీమవరం: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ పై మీడియోతో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 11 గంటలకు భీమవరంలో మెంటేవారితోట పార్టీ ఆఫీసు నందు నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పిపిపి పేరుతో ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ సిపిఐ(యం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.