రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్లో మొదటివిడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 153లో 147 పంచాయతీల్లో పోలింగ్ జరిగి మొత్తం 88% ఓట్లింగ్ నమోదయ్యాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించారు. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు తప్ప పెద్దగా ఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా కలెక్టర్ పలు కేంద్రాలను సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించారు.