అవుకు మండలంలో కొండమీది గ్రామాలలో భారీ వర్షం, పొంగిన వాగు ,రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
అవుకు మండల పరిధిలోని కొండమీద గ్రామాలలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘవృతమై మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా మండలంలోని ఉప్పలపాడు, కునుకుంట్ల గ్రామాల మధ్య గల వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆరబోసుకున్న పంట తడవడంతో మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.