అష్టాదశ శక్తిపీఠం,ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైలం కార్తీక మాసం నాల్గోవ సోమవారం మల్లికార్జునస్వామి ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది,శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు,శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6గంటల సమయం పడుతుంది,భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు,అలానే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు