కందుకూరు TIDCO గృహాల వద్ధ ఆందోళన చేపట్టిన ప్రజలు...
కందుకూరు శివారులోని TIDCO గృహాల వద్ద బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆందోళన చేపట్టారు.గుర్రంవారిపాలెం డంపింగ్ యార్డ్‌లోని చెత్తను టిప్పర్లలో తెచ్చి టిడ్కో గృహాల మధ్య కుమ్మరించడాన్ని కాలనీవాసులు అడ్డుకున్నారు. భరించలేని దుర్వాసనతో ఉన్న చెత్తను తెచ్చి ఇక్కడ డంప్ చేయడం ఏంటని నిలదీశారు. మున్సిపల్ అధికారుల ఆదేశాలతో చెత్తను పడేస్తున్నామని సిబ్బంది సమాధానం చెప్పారు. అయినప్పటికీ స్థానికులు డంపింగ్‌కు అంగీకరించ లేదు.