కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని పోరుమామిళ్ల, కాశి నాయన మండలాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి,సిపిఐ బద్వేల్ నియోజకవర్గ సమితి బృందం మొంథా తుపాన్ వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలం రాజసాహెబ్ పేటకు చెందిన రైతు కాసిం వల్లికి చెందిన నీట మునిగి కుళ్ళిపోయిన పసుపు పంటను, వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించామన్నారు.