ఒంగోలు అర్బన్: తెలుగుదేశం పార్టీ మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు.
Ongole Urban, Prakasam | Jun 20, 2026
తేది:20.06.2026, ఈరోజు మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాలమేరకు ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగు మహిళలు ఆధ్వర్యంలో నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా తెలుగు మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరెన్నో సంవత్సరాలు వర్ధిల్లాలని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను సేవా కార్యక్రమాల రూపంలో ముందుకు తీసుకువెళుతూ ఎందరికో అండగా నిలుస్తున్నారు అని అన్నారు