ఒంగోలు అర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) ప్రక్రియలో డిజిటైజేషన్ పైనా మరింత దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) ప్రక్రియలో డిజిటైజేషన్ పైనా మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు బీ.ఎల్.వో.లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించేందుకు గురువారం ఆయన ఒంగోలు నగరంలోని కబాడీపాలెంలో పర్యటించారు. ప్రతి ఇంటికీ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి, ప్రజల నుంచి వివరాలను సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. కాగా, జిల్లావ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 87 శాతం పూర్తయిందని, మిగిలిన ఓటర్లు అందుబాటులో లేరని అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలిపారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు బిఎల్ఏల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.