సిరిసిల్ల: విద్యార్థిని వైద్యానికి ఆర్థిక సహాయం చేసిన గురువులు విద్యార్థిని ప్రాణాలను కాపాడిన గురువులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మిడిదొడ్డి సాత్విక వెన్నుపూస సర్జరీకి ఉపాధ్యాయులు తాళ్ల తిరుపతి చొరవ తీసుకొని తన తోటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తో సాత్విక సర్జరీ కోసం 1,05,755 (ఒక్క లక్ష అయిదు వేల ఏడువందల యాభై అయిదు రూపాయలు) రూపాయలు జమ చేసి తన తల్లి అయిన మిడిదొడ్డి భాగ్య అకౌంట్ లోకి పంపించి, గురువులు చదువు చెప్పడమే కాదు, ప్రాణాపాయ స్థితిలో విద్యార్థుల ప్రాణాలు కాపాడుతారని నిరూపించారు.