తిరువూరులో పార్క్ చేసి ఉన్న కారులో లక్ష రూపాయలు నగదు మాయం
Tiruvuru, NTR | Sep 15, 2025 తిరువూరు మండలంలోని ఎర్రమడుగు చెందిన సురేష్ బ్యాంకు నుండి లక్ష రూపాయలు డ్రా చేసి కారు డాష్ బోర్డులో పెట్టాడు. మంచినీళ్లు బాట్లు కోసం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కారు పార్క్ చేసి పక్కకు వెళ్ళాడు ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కారు అద్దం పగలగొట్టి డాష్ బోర్డులో ఉన్న లక్ష రూపాయలు నగదును దోచుకెళ్లినట్లు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ గిరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.