భీమవరం: కొణితివాడ వేణుగోపాలస్వామి దేవస్థాన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు
భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం కొణితివాడలోని వేణుగోపాలస్వామి దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవస్థాన పాలకవర్గ ఛైర్మెన్ గా యరకరాజు వెంకట్రామరాజు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.