నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: బేతంచెర్ల సీఐ వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | May 4, 2025 రౌడీ షీటర్లు నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేశ్ బాబు ఆధ్వర్యంలో మండలంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, శాంతి యుత జీవనం గడపాలన్నారు. గొడవలను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.