గుంతకల్లు: పట్టణంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై చర్యలకు సీపీఐ ఎంఎల్ నాయకులు వినతి
అనంతపురం జిల్లా గుంతకల్లు కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీఓ విజయ్ కుమార్, అటెండర్ జిలాన్లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట మంగళవారం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ జీరో వ్యాపారాలు చేస్తున్న వారితో అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు.