బనగానపల్లె: బనగానపల్లెలో రూ 2000 కోట్లతో అభివృద్ధి పనులు: టిడిపి లీగల్ సెల్ నాయకుడు అలీ హుస్సేన్
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు రూ.2,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు గాలే సాహెబ్ అలీ హుస్సేన్ అన్నారు. కోయిలకుంట్లలో ఆయన మాట్లాడుతూ.. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, బైపాస్ రోడ్డు, యాగంటి పర్యాటక అభివృద్ధి, రహదారుల పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.