బనగానపల్లె: బనగానపల్లెలో జూలై 11న మెగా లోక్ అదాలత్
రాజీ అయ్యే కేసులను ఇరువర్గాల కక్షిదారులను ఒప్పించి రాజీబాటలో పయనించేలా కృషి చేయాలని బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి ప్రతిమ పేర్కొన్నారు. జులై 11న నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మీడియేషన్ న్యాయవాదులు సంబంధిత న్యాయవాదులతో చర్చించి వారి ప్రతివాదులను పిలిపించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.