డోన్: బేతంచర్ల లో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ
Dhone, Nandyal | Jul 13, 2026 పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా బేతంచెర్లలో విద్యార్థులు సోమవారం హరితోదయ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ ద్వారా వృక్ష సంపద సంరక్షణ, జలాశయాల రక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, అగ్నిమాపక కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నాటిన ముక్కలను సంరక్షించాలని కోరారు