మండలంలో చదువు రాని వారందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని పెద్దపప్పూరు ఎంపీడీవో రత్నాబాయి సూచించారు. పెద్దపప్పూరు లోని వెలుగు కార్యాలయంలో సోమవారం అక్షర ఆంధ్రపై వీ ఏ ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సచివాలయ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ఇప్పటికే చదువు రాని వారిని గుర్తించడం జరిగిందన్నారు. మార్చి 15న పరీక్షలు నిర్వహించి అక్షరాస్యులుగా చేయాలన్నారు.