సూర్యాపేట: ఆకాశమే హద్దుగా అవకాశాలను వినియోగించుకోవాలి కలెక్టర్ తేజ సూచన
ఆకాశమే హద్దుగా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.నేటి సాంకేతిక,కృత్రిమ మేధస్సు యుగంలో స్వతంత్రంగా ఆలోచనలతో భవిష్యత్తులో ఏమి అవ్వాలో ఆలోచిస్తూ దాని చేరెందుకు పట్టుదలతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.