రాజేంద్రనగర్: మైలార్దేవ్పల్లిలో లారీ కింద పడి చిన్నారి మృతి
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు లారీ కింద పడి రియాన్ ఉద్దీన్(8) అనే చిన్నారి మరణించాడు. రియాన్ నడుచుకుంటూ వెళ్తుండగా అదే దారిలో వెళ్తున్న మట్టి లారీ మలుపు తిప్పే క్రమంలో వెనుక టైర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డయ్యాయి.