జిల్లాలో ప్రతి ఒక్క ఉపాధి శ్రామికునికి కూడా ఈ కేవైసీ ( ఫేషియల్ యాప్ లో ) నమోదు చేయించాలని డ్రామా పిడి సలీం బాషా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని బీసీ కాలనీలో కొనసాగుతున్న ఈ కేవైసీ నమోదును డ్వామా పీడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఇప్పటివరకు 50% మాత్రమే పూర్తి అయిందని మొత్తం ఉపాధి కూలీలందరికీ ఈ కేవైసీ చేయించాలని పిడి సూచించారు. దేశవ్యాప్తంగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతూ ఉందని ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొనసాగుతుందని మరో మూడు రోజుల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామని పిడి పేర్కొన్నారు.