కామారెడ్డి: వృద్ధుల సేవా కార్యక్రమాలకు మున్సిపాలిటీ పూర్తి సహకారం - ఇప్ప ఉమారాణి
కామారెడ్డిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మున్సిపల్ పాలకవర్గం పూర్తి సహకారం అందిస్తుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యుల భేటీ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.