అనంతపురం జిల్లా చిన్న హోతూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న మరో ద్విచక్ర వాహనం మహిళకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 11, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని ఉరవకొండ మండలం చిన్న హోతూరు గ్రామం వద్ద వ్యవసాయ పనులను ముగించుకుని తన ఇంటికి వెళ్తున్న దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంపైకి మరో ద్విచక్ర వాహనం దూసుకుని రావడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్న హోతూరు గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడగా ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.