నంద్యాల అర్బన్: జగన్ రాయలసీమ ముద్దుబిడ్డ అనడం తగదు : నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
పులివెందుల, కడపకు న్యాయం చేయలేని మాజీ సీఎం జగన్ను రాయలసీమ ముద్దు బిడ్డ అనడం తగదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. గురువారం బనగానపల్లెలో నిర్వహించిన 'మీ భూమి-మీహక్కు' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా బిల్లు 33శాతం కేటాయించారని ఆమె కొనియాడారు. జగన్ను రెడ్డి అనను.. జగన్మోహన్ గారు అంటానని అన్నారు.