తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీలో పర్యటించి డ్రైనేజీ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి
తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పర్యటించారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని రజక కళ్యాణ మండపం పక్కన ఉన్న డ్రైనేజీ పైప్లైన్ ను పరిశీలించారు. డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మత్తు పనులు జరుగుతుండడంతో వాటిని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేసి నాణ్యతతో చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.