కోడుమూరు: బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఆదివారం వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. మొత్తం 10 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు అందజేశారు. పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. 10 మంది లబ్ధిదారులకు మొత్తం రూ .6,04,938 విలువైన చెక్కులు మంజూరు అయ్యాయి.