శ్రీశైలం క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాస మహోత్సవాలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన ఈవో
శ్రీశైలం క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు జరిగే కార్తీక మాస మహోత్సవాలపై ఈవో శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం ఈవో కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైల క్షేత్రానికి వచ్చే అవకాశం ఉందని, కావున అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, కార్తీక మాసాలను విజయవంతం చేయాలని, అలాగే భక్తుల రద్దీ కనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీనివాసరావు అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు.