రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో సీపీ బ్రౌన్కు ఘన నివాళులు
తెలుగు భాషా సేవకుడు సీపీ బ్రౌన్ జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసులు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయచోటి పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి హాజరయ్యారు.సీపీ బ్రౌన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి చేసిన సేవలను అదనపు ఎస్పీ గుర్తుచేశారు. కార్యక్రమంలో ఆర్ఐ వి.జె.రామకృష్ణ, సీఐ జి. శంకరమల్లయ్య, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.