కూసుమంచి: రోడ్లు మరమ్మత్తులు చేపట్టాలని ఆరెకోడుతండాలో సీపీఎం పాదయాత్ర
అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి బండి రమేష్ డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుతండా నుండి వాల్యాతండా వరకు జరిగిన పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.